Tuesday, 3 November 2026

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు

11HYMRR01-UTTAM_HY_2694485e

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌హైదరాబాద్‌,జూలై12(జనంసాక్షి):

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళ వారం హైదరాబాద్‌లో  విూడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్నిపూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఈ నెల 24వ తేదీన కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రభుత్వం రైతులను మభ్య పడుతోందని ఆయన నిప్పులు చెరిగారు. చెప్పేదొకటి చేసేదొకటి గా సిఎం కార్యాచరణ ఉందన్నారు. భూసేకరణలో పారదర్శకత లోపించిందన్నారు. ప్రాజెక్టులపై త్వరలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తామని తెలిపారు. శాసనసభలోని టీడీపీఎల్పీ కార్యాలయాన్ని ఇతరులకు కేటాయించడం సరికదని ఉత్తమ్‌  అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ జులై 18న విచారణకు వస్తుందని చెప్పారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ కోమటి రెడ్డి వెంకరెడ్డి, నేను ఎప్పుడూ మిత్రలమే మా మధ్య ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే మా మధ్య గొడవలున్నట్లు పుకార్లు చేస్తున్నారంటూ ఆయనమండిపడ్డారు. మల్లన్నసాగర్‌కు చిన్న గ్రామాల రైతులు అంగీకరించగానే నిర్వాసితులంతా ఒప్పుకున్నారని హరీష్‌ అవాస్తవాలు చెబుతున్నారంటూ ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాజెక్టుల్లోనూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *