వ్యాన్ ను ఢీ కొట్టిన విమానం – ఐదుగురి మృతి

3వ్యాన్ ను ఢీ కొట్టింది ఓ విమానం.. అదీ నడిరోడ్డుపై.. ఈ ఇన్సిడెంట్ బ్రెజిల్ లోని పరానా రాష్ట్రంలో జరిగింది. అక్కడి లోండ్రీనా సిటీలోని ఓ పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తున్న ఓ వ్యవసాయక విమానం అదుపు తప్పి రోడ్డుపైకి వెళ్లిపోయింది. అక్కడే ఆగిఉన్న ఓ వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రహదారి పనులు చేస్తున్న కార్మికుల్లో ఐదుగురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.