Tuesday, 3 November 2026

హెచ్‌సీయూలో ఐదోరోజు కొనసాగుతున్న బంద్‌

2హైదరాబాద్‌: పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ మృతి ఘటనపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఐదోరోజు బంద్‌ కొనసాగుతోంది. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పలువురు నేతలు ఇవాళ హెచ్‌సీయూకు రానున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హెచ్‌సీయూను సందర్శించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ ప్రో.రాజీనామాలు..
ఆందోళనలను మరింత ఉధృతరూపం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. ఇందుకు భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తున్నారు. వీరు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పెరుగుతూ వస్తోంది. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి నేతలు హెచ్ సీయూకు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా పరిపాలనాపరమైన పోస్టులకు ఎస్సీ, ఎస్టీ ప్రోఫెసర్లు రాజీనామా చేశారు. మరోవైపు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలు హెచ్ సీయూకు రానున్నారు.

హెచ్ సీయూకు రానున్న కేజ్రీ..సురవరం..మాయావతి..
దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ బుధవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *