Wednesday, 4 November 2026

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో బంగారం పట్టివేత

gyz3jybdరంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కస్టమ్స్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం బయటపడుతోంది. అధికంగా సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది దొడ్డిదారిన తరలించాలని శంషాబాద్ ఎయిర్ పోర్టును అడ్డాగా ఎంచుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయపడింది. దోహా నుండి వచ్చిన ప్రయాణికుడి సూట్ కేసు అడుగు భాగంలో బయటపెట్టిన బంగారం స్కానర్ లో బయపడింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే షూలో మూడు కిలోల బంగారం పెట్టుకుని తనిఖీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం బయటపడుతుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో అధికారుల హస్తం కూడా ఉండవచ్చుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *