Tuesday, 3 November 2026

‘శాండీ’ తుపాను బీభత్సం.. 11 మంది మృతి

22 లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

12 వేల విమానాలు రద్దు

న్యూయార్క్‌: అమెరికాను శాండీ తుపాను వణికిస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీగా అలలు ఎగసిపడుతూ 12 రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్‌, న్యూజెర్సీ తీర ప్రాంతాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకూ న్యూయార్క్‌, న్యూజెర్సీ, మేరీలాండ్‌, పెన్సిల్వేనియా తదితర ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు సమాచారం. శాండీ ప్రభావిత ప్రాంతాల్లో 22 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్‌లోని 3.1 మిలియన్‌ ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. భారతీ వర్షంతో న్యూయార్క్‌లోని సబ్‌వేలలో నీరు చేరింది, ఇప్పటివరకూ 12 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు. ఉత్తర కరోలినాలో సముద్రంలో చిక్కుకున్న 16 మందిని హెలికాప్టర్‌ సహాయంతో జాతీయ భద్రతా దళ సిబ్బంది రక్షించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *