శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ రాజీకి చోటుండదు – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ”
శేరిలింగంపల్లి, నవంబర్ 09( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి తాను కంకణబద్ధుడినై ముందుకు సాగుతున్నానని, రాజీకి ఎక్కడా చోటు ఉండబోదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు మియాపూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి, కొనసాగుతున్న పనుల స్థితిగతులపై కార్పొరేటర్లతో కలిసి కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. ప్రధానంగా కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, GHMC ఇంజనీరింగ్ విభాగము, జలమండలి ,టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ మరియు స్ట్రీట్ లైట్స్ విభాగం అధికారులతో కలిసి తాను రెండవ దఫా ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ పరిధిలోజరిగిన, జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి చర్చించడం జరిగిందన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పనుల స్థితిగతి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను పునరుద్ధరించడంకొరకు ప్రతిపాదించిన పనులు, కొత్త ప్రతిపాదనలు, మంజూరైన పనులు, శంకుస్థాపనకు సిద్ధమైనవి వాటి సమగ్ర సమాచారంపై సమీక్షించడం జరిగిందని ఆయన తెలిపారు. గుల్ మోహర్ పార్క్ ప్రహరీ గోడ నిర్మాణము వెంటనే చేపట్టాలని, డ్రైనేజి వ్యవస్థ నిర్వహణ తీరుపట్ల సమీక్ష జరిపి STP లకు అనుసంధానం చేసే ఔట్ లెట్ ల పై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఇంజనీరింగ్, జలమండలి, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించడం జరిగిందన్నారు. రోడ్ కట్టింగ్ సమయంలో మంచినీటి పైప్ లైన్, డ్రైనేజి పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్లకు వెంటనే మరమత్తులు చేయాలని, UGD, రోడ్లు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా వ్యవస్థను సరిగ్గా నిర్వహించాలని, రోడ్ల పనులలో వేగం పెంచాలని ఆయా విభాగం అధికారులను గాంధీ కోరారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, పటేల్ చెరువు, గంగారాం చెరువు పనుల పురోగతి పై సమాచారాన్ని తెలుసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. విద్యుత్ విభాగం అధికారులతో మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, కరెంట్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడలని, కరెంట్ తీగలు కిందికి వేలాడకుండా చూడలని, ప్రమాదకరమైన స్తంభాల చోట అవసరమైన కరెంట్ స్తంభాలు ఏర్పాటుచేయాలని, దీంతోపాటు ట్రన్స్ఫార్మర్లచుట్టూ రక్షణచర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అరకపూడి ఆదేశాలను జారీచేశారు. గోకుల్ ప్లాట్స్ లో ట్రాన్స్ఫార్మర్లను త్వరితగతిన ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకోవాలని, మరియు విధిదీపాల నిర్వహణపై అందుతున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారంఅయ్యేలా చూడాలని, కాలనీలలో వీధి దీపాలు వెలుగనిచోట వెంటనే పునరుద్ధరించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, GHMC SE శంకర్ నాయక్, EE శ్రీనివాస్, EE శ్రీకాంతిని, DE సురేష్, DE రమేష్, DE స్రవంతి AEలు సునీల్, ప్రశాంత్,శివ ప్రసాద్, ప్రతాప్, జగదీష్, AMOH కార్తిక్ జలమండలి అధికారులు GM రాజశేఖర్, DGM నాగప్రియ , మేనేజర్లు సుబ్రమణ్యం యాదయ్య, సందీప్, నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సాయిచరిత, సునీత, మానస ACP సంపత్, స్ట్రీట్ లైట్స్ ఈఈ ఇంద్రదీప్, DE సునీల్, AE రామ్మోహన్, రాజశేఖర్, విద్యుత్ విభాగం అధికారులు DE, ADE , AE లు తదితరులు పాల్గొన్నారు