శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి బిజెపి నేతల నివాళి

శ్రీకాకుళం,జూలై6(జ‌నం సాక్షి): భారతీయ జనసంఘ్‌ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి బిజెపి ఘనంగా నివాళి అర్పించింది. ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్వర్యంలో, శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణ రావు, పైడి వేణుగోపాలం, నగర ఆధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర రావు, దుప్పల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో, పిఎన్‌.కాలనీలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పార్టీ నగర నాయకులందరూ ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటారు.