కొలంబో: శ్రీలంక నూతన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన గ్రాహమ్ ఫోర్డ్ ఎంపికయ్యాడు. మార్వన్ ఆటపట్టు గత సెప్టెంబర్‌లో కోచ్ పదవికి రాజీనామా చేయడంతో శ్రీలంక క్రికెట్ సంఘం నూతన కోచ్ వేటలో పడింది. ఐదు నెలల అనంతరం గ్రాహమ్ ఫోర్డ్‌ను ఎంపిక చేసింది. కోచ్‌గా గ్రాహమ్ ఫోర్డ్‌తో పాటు బంగ్లాదేశ్ కోచ్ చండికా హతురుసింగా పేర్లను పరిశీలించారు. అయితే గతంలో కోచ్‌గా పనిచేసిన గ్రాహమ్ పనితీరుపై సంతృప్తిగా ఉన్న శ్రీలంక క్రికెట్ సంఘం ఆయనకే ఓటు వేసింది. 2012లో తొలిసారి శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫోర్డ్ 2014లో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించనున్న ఫోర్డ్ 2019 ప్రపంచకప్ వరకు శ్రీలంక కోచ్‌గా పనిచేయనున్నాడు.