Friday, 6 November 2026

శ్రీవారిని  దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి

తిరుమల,మే15(జ‌నం సాక్షి ):  తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించిన అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. జేఈవో శ్రీనివాసపరాజు స్వామివారి శేషవస్త్రంతో ఆయన్ని సత్కరించి తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు ఆయన తిరుమల చేరుకోగానే ఇవో అశోక్‌ సింఘాల్‌ స్వాగతం పలికారు.