శ్రీవారి సేవలో మంత్రి అమర్‌నాథ్‌

తిరుమల,నవంబర్‌16(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. తితిదే అధికారులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతరాత్రి మంత్రి పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

తాజావార్తలు