Monday, 2 November 2026

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 45వేల 696 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం ఏడు గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు లక్షా 92వేల 312 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్న సాగర్‌కు 73వేల 800 క్యూసెక్కులను వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 11వేలు, హంద్రీనీవా సృజల స్రవంతి పథకానికి 1350 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.