శ్రీహరికోటలోని షార్‌లో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి 27 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇది షార్ ప్రయోగిస్తున్న 3వ నావిగేషన్ శాటిలైట్. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 డి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సోమవారం సాయంత్రానికల్లా శాటిలైట్ అనుసంధాన పనులు పూర్తి చేసి సెకండ్ ల్యాంచ్ ప్యాడ్‌కు రాకెట్‌ను తరలించనున్నారు. ఈ నెల 25వతేదీన జరగనున్న మిషన్‌రెడీ రివ్యూనెస్ సమావేశంలో రాకెట్ ప్రయోగ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. 26వతేదీ ఉదయం ఆరు గంటలనుంచి రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్ ఆరంభిస్తామని శ్రీహరికోటలోని షార్ అధికారులు వివరించారు.
షార్‌లో 28న పీఎస్‌ఎల్‌వీ – సి 27 రాకెట్ ప్రయోగం




