సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వికారాబాద్ లో జరిగిన బహిరంగ సభలో షావుకారులపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని షావుకారల సంఘం నాయకులు కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని వర్తకసంఘం సమావేశం మందిరంలో ఆయన మాట్లాడుతూ షావుకారులు చాలా మౌనంగా తమ వ్యాపారం తాము చేసుకుంటారని, వారి జోలికొస్తే అవసరమైనప్పుడు అస్త్రాన్ని సంధించటానికి కూడా వెనుకాడరని తెలిపారు.సిద్దిపేట ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసినప్పుడు మీకు సహకారం అందించింది షావుకారులేనని గుర్తుంచుకోవాలన్నారు.ఇంతకు ముందు కూడా రెండు సార్లు షావుకార్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారని,సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.షావుకార్లకు ఆర్ధిక శాఖ మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.ఇంకొకసారి షావుకార్ల జోలికొస్తే వూరుకునేది లేదన్నారు.షావుకార్లకు సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గుడిపాటి శేషయ్య , మహంకాళి సోమయ్య , ఓరుగంటి నాగేశ్వర్ రావు , ఇమ్మడి వెంకన్న , కృష్ణ , సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
షావుకార్లపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు తగదు




