సంపూర్ణ స్వచ్ఛతా కోసం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవ.
సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మండల ఎంపీపీ రాథోడ్ సజన్ హాజరై గ్రామపంచాయతీ ఆవరణలోజిపి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామంలోని ప్రజలతో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ ప్రతి కుటుంబానికి ఒక మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకొని మల మూత్ర విసర్జనకు మరుగుదొడ్డిని ఉపయోగించుకొని గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంట వెంకట రమణ ఉపసర్పంచ్ కార్యదర్శి రాఘవులు వార్డు సభ్యులు పాఠశాల సిబ్బంది గ్రామ ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.