జనవరి 22 వరకు అమలు పరుస్తూ సిపి ఉత్తర్వులు
హైదరాబాద్,నవంబర్21(జనంసాక్షి): సచివాలయం చుట్టూ మూడు కిలోవిూటర్ల పరిధిలో రెండు నెలల పాటు నిషేధాజ్ఞలు పొడిగిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల 23వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి జనవరి 22వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండంతో
రెండింటికి ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు సచివాలయంతో పాటు దాని చుట్టూ 3 కిలోవిూటర్ల పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిషేధాజ్జలు అమలులో ఉన్నందున ఐదుగురికి మించి సంచరించడం, బ్యానర్లు, లాఠీలు, కత్తులు, ఆయుధాలతో సంచరించడం, నినాదాలు చేయడం, ప్రసంగించడం, ధర్నాలు, ర్యాలీలు, పికెటింగ్, ధర్నాలు నిర్వ హించడం వంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించారు, ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.




