మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. ఘటనలో రాజయ్య కోడలు, మనువళ్లు మృతిచెందడం బాధాకరమన్నారు. రాజయ్య కుటుంబానికి జానారెడ్డి సంతాపం తెలిపారు. ఉపఎన్నిక ముందు ఘటన జరగడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు.