– స్పీకర్ కోడెల శివప్రసాద్
గుంటూరు ,నవంబర్14(జనంసాక్షి) : సత్తెనపల్లిలో రూ.200కోట్లతో అభివృద్ది పనులు చేశామని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. బుధవారం సత్తెనపల్లిలో నిర్వహించిన నగరదర్శని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కోడెల మాట్లాడుతూ.. సాగర్‌లో నీళ్లు సప్లిమెంటరీ మాత్రమే అని.. వర్షాలు లేకపోతే నీళ్లు చాలవని, మాచర్ల వద్ద కాలువకు గండి పడడంతో నీటి సరఫరా ఆపివేడం జరిగిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలతో రైతులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎప్పుడూ నీటికి సమస్యే ఉంటుందన్నారు. గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా ఈనెల 21న నకరీకల్లు వద్ద హరిశ్చంద్రపురం లిప్ట్ స్కీమ్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు.
సత్తెనపల్లిలో రూ.200కోట్లతో అభివృద్ది పనులు




