Wednesday, 4 November 2026

సప్లిమెంటరీ ఫలితాల్లో 49.79శాతం ఉత్తీర్ణత

ఫలితాలు విడుదల చేసిన కడియం శ్రీహరి

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 49.79శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 45.79శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి కడియం వెల్లడించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ఉత్తీర్ణులైన వారు ఈనెల 31 వరకు ఇంటర్‌లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. ఆదివారం నుంచి రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మొదటి స్థానంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా నిలవగా.. చివరి స్థానంలో ఆదిలాబాద్‌ జిల్లా నిలిచింది. బాలురకంటే బాలికల ఉత్తీర్ణత 4.01శాతం అధికంగా నమోదైంది. రీకౌంటింగ్‌ ఫీజు రూ.500తో జులై 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌నెట్‌ నుంచి షార్ట్‌ మెమో పొందవచ్చు. వారం రోజుల్లో పాఠశాలలకు మార్కుల జాబితాలు పంపిస్తాం. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్‌ అయిన వారికి ఇంటర్‌ అడ్మిషన్లు జరుగుతాయి. ఉత్తీర్ణులైన వారు లాంగ్‌ మెమోతో సంబంధం లేకుండా షార్ట్‌ మెమోతో ఇంటర్మీడియెట్‌లో జాయిన్‌ కావొచ్చు.

–