హైదరాబాద్‌లో వారం రోజుల పాటు పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా మైకులు కూడా వాడవద్దని తెలిపారు. మారణాయుధాలతో తిరగడం, ప్రజలకు ఇబ్బందులు కల్గించేలా ఎవరు వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వాహణలో ఉండే పోలీసులు, మిలటరీ, హోంగార్డు, అంతిమ యాత్రలకు మినహాయింపు ఉందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 6 నుంచి వచ్చే నెల 6వ తేదీ ఉదయం 6 వరకు ఈ నిషేధాజ్జలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సభలు, సమావేశాలు నిషేధం




