– పరువుపోతోంది
– రాష్ట్రపతి సూచన మేరకు నడుచుకోండి
– ప్రధాని మోదీ ఆవేదన
న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): పార్లమెంట్లో గురువారం మోదీ తన వాక్చాతుర్యాన్ని మరోసారి బయట పెట్టారు. చతురత, చమక్కులతో పార్లమెంట్లో అధికార పక్షంలో నవ్వులు పూశాయి. సీరియస్‌గా విషయాలను స్పష్టంగా ప్రస్తావిస్తూనే తన మాటల గారడితో కాంగ్రెస్‌కు సెటైర్లు వేశారు. గతంలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ ఇందిరాగాంధీ చెప్పిన విషయనాలను ప్రస్తావించారు. సంవత్సరంతో సహా చెబుతూ పార్లమెంట్ నడిస్తేనే విపక్షాలకు పని ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రజల గొంతు వినిపిస్తుందని వివరించారు. పార్లమెంట్ ఎలా నడవాలన్న అంశాన్ని రాష్ట్రపతి స్పష్టంగా చెప్పారని, ఆయన సూచనను పాటించడం మనందరి బాధ్యత అని మోదీ పేర్కొంటూ అభివృద్దికి పలు సలహాలు ఇస్తే తీసుకుంటామని ప్రకటించారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహిళల ప్రస్తావన రావడంతో రాష్ట్రపతి సూచనలను గుర్తు చేశారు. దేశంలోని మహిళా ప్రజాప్రతినిధులతో సమ్మేళనం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి సూచించారని. సభలో ప్రతి ఒక్కరికి ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజల సమస్యలకు పరిష్కారం లభించే వేదిక పార్లమెంట్ అని, దీనిని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. అందుకణుగుణంగా ప్రతి ఎంపీ నడుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క సభ్యుడు సభా మర్యాదలను పాటించాలని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదని చెప్పారు. ఒకవేళ పార్లమెంట్ సజావుగా జరగకపోతే ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఆస్కారం ఉండదనే విషయాన్ని విపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. గతంలో సభా సమయాన్ని వృథా చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే సమస్యలపై నాటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వ్యాఖ్యానాన్ని ఈ సందర్భంగా ప్రధాని ఉటకిస్తూ గతాన్ని గుర్తుచేసే పనిని మోదీ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా సభా మర్యాదలు కాపాడటంలో రాజీవ్‌గాంధీ ప్రసంగాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఇందిరాగాంధీ మాటలు కూడా కోట్ చేస్తూ వివరణాత్మకంగా మోదీ మాట్లాడారు. బిల్లులు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. .రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లుగా పార్లమెంట్ ఫలప్రదమైన చర్చలు జరగాలనేదే తన ఆకాంక్ష అని మోదీ చెప్పుకొచ్చారు. కాని సభలో జరుగుతున్న పరిణామాల పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇది ఎవరికీ మంచిది కాదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బిల్లులు పాస్ కావడంలో ప్రతిపక్షాలు సహకరించాలని అన్నారు. అంతేకాకుండా కొందరు ఎంపీల ఆత్మనూన్యతాభావం వల్లే పార్లమెంట్ సజావుగా సాగడం లేదని ప్రధాని మోదీ చమత్కరించారు. ఆ భావనతోనే కాంగ్రెస్ ఎంపీలు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున కేవలం మహిళా ఎంపీలు మాత్రమే సభలో మాట్లాడుతారని మోదీ అన్నారు. రాహుల్‌కు వయసు పెరిగింది కానీ, అవగాహనా జ్ఞానం పెరగలేదని ఎద్దెవ చేశారు. దేశంలో ప్రజల అవసరాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేకానేక సవాల్లను చట్ట సభల్లో సమగ్రంగా చర్చించి ఇప్పుడున్న చట్టాలను సవరించుకోవడమా…వాటికి అనుబంధంగా మరిన్ని రాసుకోవడమా చర్చించేందుకు చట్ట సభలు ఉపయోగపడాలని, పార్లమెంట్ ఎలా నడపాలన్న విషయాన్ని రాష్ట్రపతి సూచించిన విషయాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ప్రధామంత్రి నరేంద్ర మోడి స్పష్టం చేశారు. గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ దేశంలోని మహిళా ప్రజాప్రతినిధులతో సమ్మేళనం ఏర్పాటు చేయాలని సూచించారన్నారు. సభలో ప్రతి ఒక్కరికి ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ఉంటుందని ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా సభా మర్యాదలను పాటించడం మంచిదన్నారు. పార్టమెంట్ సజావుగా సాగకపోతే ప్రజల సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోతుందన్నారు. సభాసమయాన్ని వృధా చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే సమస్యలపై నాటి స్పీకర్ సోమనాథ్ చటర్జీ వ్యాఖ్యానాన్ని ఈసందర్బంగా ప్రధాని ఉటంకించారు. సభా మర్యాదలు కాపాడడంతో రాజీవ్‌గాంది గొప్ప సూచనలు చేశారని ఆయన చేసిన ప్రసంగాన్ని కూడా సభలో ప్రస్తావించారు. బిల్లులు ఆమోదం పోందే విషయంలో అన్ని పార్టీలు సహకరించి ఆమోదం తెలుపాలన్నారు. పార్లమెంట్ స్తంబిస్తే దేశం క్షోబిస్తుందన్నారు. నేడు సభను అడ్డుకుంటున్న కాంగ్రెస్ గతంలోవారి వారి ప్రధానులు, నేతలు ఏం మాట్లాడారో ఒక్కసారి ఆలోచించుకోవాలని గుర్తు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాద్దాంతం చేయడం కాంగ్రెస్‌కు అలవాటై పోయిందని ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున కేవలం మహిళ ఎంపిలు మాత్రమే మాట్లాడతారని ప్రధాని స్పష్టం చేశారు.ఇలా మోదీ ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేశారు. దీంతో కాంగ్రెస్ కూడా తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.





