సరికొత్త రాజకీయశకం ఆవిష్కరణకే.. జనసేన ఆవిర్భవించింది
– 2019లో గెలిచేందుకే మాత్రం కాదు
– 15న జరిగే ‘జనసేన కవాతు’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
– తెలంగాణలో పోటీవిషయంపై నాలుగు రోజుల్లో తేల్చేస్తా
– పారిశ్రామిక వేత్తలపై దాడులతో టీడీపీకి ఉలిక్కిపాటెందుకు?
– సచివాలయం, సీఎం ఇంటిపై దాడులు జరిగుంటే అండగా ఉండేవాళ్లం
– తానెప్పుడూ బీజేపీని వెనుకేసుకురాలేదు
– మోదీ ‘నాకు బ్రదరు కాదు.. అమిత్ షా నా బాబాయి’ కాదు
– ‘తిత్లీ’ తుపాను.. బాధితులకు అండగా ఉంటాం
– జనసేన అధినేత పవన్ కల్యాణ్
– విజయవాడలో జనసేన కేంద్ర కార్యాలయం ప్రారంభం
విజయవాడ, అక్టోబర్13(జనంసాక్షి) : సరికొత్త రాజకీయ శకం ఏపీకి కావాల్సిన తరుణంలోనే జనసేన ఆవిర్భవించిందని, ఆమేరకు తాము ముందుకెళ్తున్నామని, కేవలం 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు.. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుపాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన సైనికులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన నాదెండ్ల మనోహర్‌తో కలిసి సాయంత్రం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.
ఈనెల 15న జరగనున్న జనసేన కవాతులో ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనోహర్‌తో తనకు పాఠశాల స్థాయి నుంచే పరిచయం ఉందని పవన్ తెలిపారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన విలువైన సలహాలు, సూచనలు అందిచేవారని తెలిపారు. సరికొత్త రాజకీయ శకం ఏపీకి కావాల్సిన తరుణంలోనే జనసేన ఆవిర్భవించిందని కేవలం 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం కాదని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతుందని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. ఐటీ దాడులు సచివాలయం, సీఎం ఇంటిపై జరిగుంటే ప్రభుత్వానికి అండగా ఉండేవాళ్లమన్నారు. కానీ వ్యాపారవేత్తలపై రైడ్స్ జరుగుతుంటే టీడీపీకి ఎందుకని నిలదీశారు. నిజంగా ఢిల్లీలో మాదిరిగా కేజీవ్రాల్‌పై జరిగినట్లుగా.. అమరావతిలో కూడా ఐటీ దాడులు జరిగుంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్లమని వెల్లడించారు. అయినా తానెప్పుడూ బీజేపీని వెనకేసుకురాలేదన్నారు. వెనకేసుకురావడానికి బీజేపీ మాకు బంధువేవిూ కాదన్నారు. మోదీ ‘నాకు బ్రదరు కాదు.. అమిత్ షా నా బాబాయి కాదని చెప్పారు. 2014ఎన్నికల్లో ప్రజలకు అండగా ఉంటారనే తాను బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని స్పష్టం చేశారు. సంపాదన వదిలేసి మరి ఆరెండు పార్టీలకు అండగా నిలిచానని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు అనుభవం ప్రజలను అయోమయంలోకి నెట్టిందన్నారు. ప్రత్యేక ¬దాపై సీఎం మాట మార్చడం వల్లే ప్రజలు గందరగోళానికి గురయ్యారని తెలిపారు. ¬దాపై నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ¬దాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే జనసేన కూడా వస్తుందన్నారు. అఖిలపక్ష నాయకులంతా మోదీని కలవాలని సూచించారు. ¬దా కోసం జనసేనలా ఎవరూ గళమెత్తలేదని వ్యాఖ్యానించారు. రాజకీయ జవాబుదారీ కోసమే ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు నిర్వహిస్తుందన్నారు. ఏపీకి సరికొత్త రాజకీయశకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై అమరావతి కేంద్రంగా జనసేన పార్టీ కార్యకలాపాలు ఉండబోతున్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఎవరో పాలకులు చేసిన తప్పులకు ప్రజలెందుకు బలికావాలని అడిగారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై 4, 5 రోజుల్లో తేల్చేస్తామన్నారు. విూడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఏపీలో పర్యటన ముగించాక తెలంగాణ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్న సమయంలోనే ముందస్తు ఎన్నికలొచ్చేశాయని చెప్పారు. విజయవాడలో జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం శుభపరిణామమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనస్తత్వం ఉన్న పవన్‌తో కలిసి పనిచేయాలనే తాను
జనసేనలోకి చేరినట్లు వివరించారు. ఈ క్రమంలో దీర్ఘకాల పోరాటాలకు సైతం సిద్దంగా ఉన్నమని తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి త్యాగాలకైనా తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు.