సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి):సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి సందర్భంగా బోయినిపల్లిలోని జయనగర్ కాలనీలో పాపన్న గౌడ్ విగ్రహానికి కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి నివాలర్పించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  పేద కుటుంబంలో పుట్టిన కూడా తాను ఒక్కక్షణం కూడా విశ్రమించకుండా నిరంతరం పోరాడి రాజుగా పరిపాలించడం అంటే అసలు మాటల్లో వర్ణించలేని చరిత్రకారుడు వారిని ఆనాటి ప్రజలు సర్దార్ అని బిరుదుతో సత్కరించుకున్నారంటేనే నేటి యువత వారి పోరాటాన్ని అవగతంచేసుకోవచ్చు.మనం అందరం నాటి మహనీయుడైన సర్దార్ పాపన్నని స్మరించుకుంద్దాం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్త, మాజీ కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.