Friday, 6 November 2026

సర్వే నెంబర్‌ ఆధారంగానే ధాన్యం కొనుగోలు

– ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రైతుల ధాన్యాన్ని సర్వే నెంబర్‌ ఆధారంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి

పుల్లారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సీఎం అధ్యక్షతన సమావేశం జరిగిందన్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల రైతులతో సమావేశం జరిగిందన్నారు. రైతుల కోరిక మేరకు కొన్ని సవరణలు చేశామన్నారు. సర్వే నెంబర్‌ ఆధారంగా గతంలో ఉన్న పద్దతినే కొనసాగిస్తామన్నారు. ధాన్యం అమ్మకంలో పాస్‌ పుస్తకం ఉన్న రైతులే ఉండాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాను యూనిట్‌ గా తీసుకొని గతేడాది కొనుగోలు విధానాన్నే అమలు చేస్తున్నామన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.