హైదరాబాద్ జనవరి04(జనంసాక్షి): ముంబయిలోని బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ ఇంటి ఎదుట తమిళ నాయకులు ఆదివారం ఆందోళన చేపట్టారు. శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సెకు మద్దతుగా సల్మాన్‌ఖాన్ ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ తమిళ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. సల్మాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజపక్సె కుమారుడు నమల్ కోరిక మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సల్మాన్‌ఖాన్ అంగీకరించారు. ఆయనతోపాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.





