Monday, 2 November 2026

ఆహుతి ప్రసాద్‌ కన్నుమూత

6

హైదరాబాద్‌ జనవరి04(జనంసాక్షి): ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్‌(57) కన్నుమూశారు. క్యాన్సర్‌తో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్‌ వరప్రసాద్‌. ఆహుతి ప్రసాద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం కోడూరు. ‘విక్రమ్‌’ చిత్రంతో సినీజీవితం ప్రారంభించారు. ఆహుతి చిత్రంతో ఆహుతి ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. దాదాపు 275 చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళంలో 2, కన్నడలో 3, హిందీలో సూర్యవంశ్‌ చిత్రంలో నటించారు. ఆహుతి ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం రుద్రమదేవి.

2003లో నేను నిన్ను ప్రేమిస్తున్నా చిత్రంలో ఉత్తమ విలన్‌గా నంది పురస్కారం అందుకున్నారు.

2008లో చందమామ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారం లభించింది.

కొత్త బంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్‌ చిత్రాల్లో ఆహుతిప్రసాద్‌ నటించారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ఆహుతి ప్రసాద్‌ నటించిన రుద్రమదేవి, శంకర, పట్టపగలు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *