సాంకేతిక విప్లవ సారథి కేటీఆర్‌

– టెక్‌ హబ్‌ గా ఎదిగిన హైదరాబాద్‌
– ప్రపంచ స్థాయి కంపెనీల చూపు రాజధాని వైపు
– మంత్రిపై నీతిఆయోగ్‌ సీఈవో ప్రశంసలు
– మైక్రాన్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో అమితాబ్‌ కాంత్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రగతి నాయకుడని నీతి ఆయోగ్‌ సీఈవో అమిత్‌కాంత్‌ అన్నారు. నగరంలోని మాధాపూర్‌లో అమెరికాకు చెందిన సెమి కండక్టర్స్‌ కంపెని మైక్రాన్‌ గ్లోబల్‌ డెవపల్‌మెంట్‌ సెంటర్‌ను కేటీఆర్‌తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ నగరం గడిచిన ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సొంతం చేసుకుందన్నారు. ఈ మార్పుకు నాయకత్వం వహించింది మంత్రి కేటీఆరేనని ప్రశంసల్లో ముంచెత్తారు. మైక్రాన్‌ తన డెవలప్‌మెంట్‌సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌కు మించిన నగరం ఇంకోటి లేదన్నారు. ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ కంపెనీలు పరిశోధన, సేవల అభివృద్ధి, ఆవిష్కరణలను రానున్న రోజుల్లో హైదరాబాద్‌ ను కేంద్రంగా చేసుకున్నాయన్నారు. ఇందుకు అవసరమైన వనరులు, నైపుణ్యాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయన్నారు.ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రాన్‌ రానున్న రోజుల్లో ఇండియా నుంచి, ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. మైక్రాన్‌ సంస్థ సెవిూకండక్టర్‌ రంగంలో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండో స్థానం నుంచి ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థానానికి వెళ్లాలంటే, భవిష్యత్‌ ప్రణాళికలు, వృద్ధి అంతా హైదరాబాద్‌ నగరం నుంచే సాద్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సెవిూ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటి పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన ఈకో సిస్టమ్‌ సిద్ధంగా ఉన్నదని, ఇక్కడ ఉన్న ఐఐటీ, ఐఐఐటీ ఉన్నత విద్యా ప్రమాణాలున్న ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇందుకు దోహదం చేస్తున్నయన్నారు. ఇండస్ట్రీస్‌ ఏర్పాటులో మంత్రి కేటీఆర్‌ అందిస్తున్న సహకారం అద్భుతమైందని అన్నారు. ఇలాంటి నాయకుడు ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్న మైక్రాన్‌ సంస్థను ఆయన అభినందించారు. గత ఐదేళ్లుగా దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, 30 కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకువచ్చామని తెలపారు. భారతదేశంలో డేటా విప్లవం వలన అనేక మార్పులు రాబోతున్నవన్నారు. అమెరికా, చైనా, యూరప్‌ వంటి అనేక దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడి మొబైల్‌ డాటా అత్యంత చవకైనదన్నారు. డేటా విప్లవం వలన, డిజిటలీకరణ అనేక నూతన అవకాశాలు ఏర్పడతాయన్నారు. భారతదేశంలోని సమస్యలకి సరైన పరిష్కారాలు కనుగొనగలిగితే, విశ్వవ్యాప్తంగా విస్తరించడం అత్యంత సులువన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ల టాక్స్‌ వలన దేశం పెట్టబడులకు మరింత ఆకర్షణీయంగా తయారైందన్నారు.మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ శ్రేణి సెమి కండక్టర్‌ సంస్థలను నగానికి తీసుకువస్తానన్నారు. టాప్‌ సెవిూ కండక్టర్‌ కంపెనీ మైక్రాన్‌ హైదరాబాద్‌ లో తమ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ లో రెండు ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్స్‌ ఉన్నాయన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించిన మైక్రాన్‌ సెమి కండక్టర్స్‌ మనుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరం అయన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు.

తాజావార్తలు