Tuesday, 3 November 2026

సాక్షి మహరాజ్ కు షాక్

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న తమ పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలకు మేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలని అందులో పేర్కొంది.
నోటీసుకు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లలను కనాలంటూ సాక్షి మహరాజ్ తాజాగా వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి అంతకుముందు పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *