Tuesday, 3 November 2026

సాగునీటిపై రైతాంగం ఆందోళన

హైదరాబాద్‌: వరి నాట్లు వేస్తున్న కృష్ణా డెల్టా రైతాంగం సాగు నీరు విషయంలో ఆందోళన చెందుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ అన్నారు. 15 టీఎంసీల నీటిని అందిస్తామని వాగ్దానం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం 3టీఎంసీలు మాత్రమే విడుదల చేయించారన్నారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం కన్నా 1.2 అడుగులు ఎక్కువ ఉందని దేవినేని చెప్పారు. ఆ నీటిని విడుదల చేసేలా చూడాలన్నారు. ఈ తీరుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *