సాధికారత మండల సమాఖ్య 13 వ వార్షిక సర్వసభ్య సమావేశం
కేసముద్రం జూలై 6జనం సాక్షి/మండల కేంద్రంలో బుధవారం శ్రీ శక్తి భవన్ కార్యాలయం నందు సాధికారత సహాయ సహకార పొదుపు పరపతి మరియు మార్కెటింగ్ మండల సమాఖ్య 13వ వార్షిక మహాసభ (సర్వసభ్య సమావేశం)జరిగింది. ఈ సందర్భంగా మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నుకోవడం జరిగింది. అద్యక్షరాలుగా మంద మౌనిక,కార్యదర్శి పెరుమాళ్ళ యాకలక్ష్మి,కంది మమత, ఉపాధ్యక్షురాలు గా మమత,సహకారదర్శి లలిత లు ఎన్నిక కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో సి డిపిఎం శ్రీనివాస్,ఏపీఎం రాజీర్ బాబు,అశోక్ పాల్ మరియు సిఆర్పి రజిత,సీసీలు,అకౌంటెంట్ లు పాల్గొన్నారు.