సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు

2హైదరాబాద్‌: ప్రపంచ నంబర్‌ 1 జంట సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోరు కొనసాగుతోంది. ఈ జంట వరుసగా 28వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టించింది. 1994లో జిగి ఫెర్నాండెజ్‌, నటాషా జెరెవా వరుసగా 28 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. ఇప్పుడు సాన్‌టినా జోడీ కూడా ఈ రికార్డును సమం చేశారు.

బుధవారం జరిగిన సిడ్నీ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా జంట 6-2, 6-3 వరుస సెట్లతో చెన్‌ లియాంగ్‌, షాయ్‌ పెంగ్‌ను ఓడించి వరుసగా 28వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.