Thursday, 5 November 2026

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): నగరంలోని మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కీర్తన ఆత్మహత్య చేసుకుంది. ఆల్విన్‌ కాలనీలోని తన నివాసంలో కీర్తన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కీర్తన, శ్రీధర్‌లకు 9సంవత్సరాల క్రితం విహహం జరిగింది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. కీర్తన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, భర్త శ్రీధర్‌ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేసి, ప్రస్తుతం మరొక ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో కీర్తన ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.