సామూహిక అక్షరాభ్యాసం
రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనల మేరకు మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో సోమవారం రోజున ఎంపీటీసీ బెదురు తిరుపతి అధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. బెదురు తిరుపతి మాట్లాడుతూ..మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని, అంగన్వాడీకి వచ్చే వారిని ఆట పాటలతో ఆనంద పర్చడమే కాకుండా ఆంగ్లంలో మంచి విద్య బోధన చేయడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడం పట్ల అవగాహన కల్పించారు. ఎంపీటీసీ బెదురు తిరుపతి, ప్రైమరీ స్కూల్ ప్రదానోపాధ్యాయుడు వీరారెడ్డి, నాయకులు భాస్కర్, అంగన్వాడీ టీచర్ భవానీ, ఆశ వర్కర్ చంద్ర కళ, ఆయమ్మ లచ్చవ్వ, బాలింతలు తతితరులు పాలోగన్నారు.