సావిత్రి మళ్లీ పుట్టారు అన్నట్లుంది

మహిళ మండలి చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి
అమరావతి, మే26(జ‌నం సాక్షి) : ‘మహానటి’ సినిమా ద్వారా సావిత్రిని మళ్లీ పుట్టారు అన్నట్లుందని మహిళ మండలి చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. శనివారం ఏపీ సీఎం చంద్రబాబును ‘మహానటి’ సినిమా యూనిట్‌ కలిసింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మహిళ మండలి ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమాల గురించి ఎప్పుడు ప్రస్తావించరని, సినిమాలు చూసే తీరిక కూడా ఆయనకు ఉండదని అన్నారు. ఆయన బాహుబలి గురించి మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్‌ అయిందని నన్నపనేని అన్నారు. అలాగే మహానటి గురించి ఈ మధ్య కాలంలో పార్టీలో, కేబినెట్‌ విూటింగ్‌లో మహానటి గురించి మాట్లాడినప్పుడు… సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు.. వెళ్లి చూడాలని, అంతకుముందు చూడనివాళ్లు కూడా ఈ సినిమాను చూసిన సందర్బం ఉందని ఆమె అన్నారు. దీనికి కారణం ఏంటంటే ‘సావిత్రిగారు మళ్లీ పుట్టారు’ అని నన్నపనేని అన్నారు. సావిత్రి మళ్లీ పుట్టడానికి అశ్వినీదత్‌ కుమార్తె, అల్లుడు.. వారి
నిర్ణయమేనని కారణమని అన్నారు. దీనికి సావిత్రి కుమార్తె చాముండేశ్వరీ కూడా సహకరించారని నన్నపనేని కొనియాడారు. ఈ చిత్రానికి ఎక్కువ మంది మహిళలే పనిచేయడం విశేషమని ఆమె అన్నారు. ఈ సినిమాలో నీతి, ఆదర్శం, సందేశం, మహిళ స్ఫూర్తి ఉందని ఆమె పేర్కొన్నారు.