విశాఖ, జనంసాక్షి: సింహాచలం గోశాలలో 20 కోడె దూడలు మృతి చెందాయి. గత పది రోజుల వ్యవధిలో మొత్తం 150 గోవులు మృతి చెందినట్లు సిబ్బంది చెబుతున్నారు. గోశాలలో సంరక్షణ చర్యలు లేకనే గోవులు మృతి చెందాయని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.




