Tuesday, 3 November 2026

సిద్దిపేటలో పుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం

పారిశ్రామక కారిడార్‌ ఏర్పాటుతో ముందుకు సాగుతాం: హరీష్‌

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): సిద్దిపేటలో మొదలు పెట్టి అన్ని జిల్లాకు విస్తరించాలనేది మా ప్రయత్నం అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో రైతులకు అండగా నిలిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సోమవారం నాడిక్కడ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇండస్టియ్రల్‌ పాలసీ టీఎస్‌ ఐపాస్‌ అని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మలేషియాకు చెందిన సవిూకృత వ్యవసాయాధారిత పరిశ్రమ డీఎక్స్‌ ఎన్‌ కంపెనీ సిద్ధిపేటలో తమ యూనిట్‌ను ప్రారంభించనుందన్నారు. సిద్దిపేట శివారులోని మందపల్లి గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్లతో పరిశ్రమను స్థాపించనున్నారు. ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా మరో 700 మందికి ఈ కంపెనీ ఉపాధి కల్పించనుంది. సిద్ధిపేటలో డీఎక్స్‌ ఎన్‌ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మలేషియాకు చెందిన కంపెనీ ప్రతినిధి డాక్టర్‌ లిన్‌ బృందం, సెంటర్‌ ఫర్‌ దలిట్‌ సర్కిల్‌ ప్రతినిధి మల్లెపల్లి లక్షయ్య, ఆంజనేయులుతో కలిసి మంత్రి హరీష్‌రావును కలిసారు. దక్షిణ భారతదేశంలో డీఎక్స్‌ ఎన్‌ సంస్థ విస్తరణలో భాగంగా మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. దేశంలో డీఎక్స్‌ ఎన్‌కంపెనీ 18 ఏళ్లుగా పని చేస్తున్నదని చెప్పారు. వారం, పది రోజుల్లో ఫార్మాలిటీస్‌ పూర్తయి నాలుగు నెలల్లో కంపెనీ ఏర్పాటు కానుందని తెలిపారు. సిద్దిపేట సవిూపంలో మిట్టపల్లి, ముండ్రాయి, రాజగోపాల్‌ పేట్‌, పాలమాకుల నుంచి భూమి సేకరించి సిద్దిపేట ఇండస్టియ్రల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 500 ఎకరాలు సేకరించామని.. సిద్దిపేట ప్రాంతంలో కెమికల్‌ పరిశ్రమలు కాకుండా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జపాన్‌ బేస్డ్‌ పరిశ్రమ కూడా నర్మేట ప్రాంతంలో రాబోతున్నదని తెలిపారు. సిద్దిపేట ప్రాంతంలోని విద్యావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వంద రకాల పంటలను ఈ యూనిట్లో ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేస్తామన్నారు. అటు పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టి ఇస్తున్నదని చెప్పారు.