సినీ నిర్మాత జలదీక్ష
విజయవాడ,మే12(జనం సాక్షి ): ప్రత్యేక హోదా కోసం పున్నమి ఘాట్‌లో సినీ నిర్మాత రవిచంద్ జలదీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ప్రజలకు అన్యాయం జరిగినా పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు స్పందించరా అని ప్రశ్నించారు. సమస్యలు వస్తే వెంటనే సమావేశాలు పెట్టుకునే వాళ్లుప్రజల కోసం ఎందుకు బయటకు రారు అని అన్నారు. ఆదివారం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని హోదా కోసం ఉద్యమించాలని సూచించారు. తమిళ హీరోలను చూసి అయినా తెలుగు హీరోలు బుద్ది తెచ్చుకోవాలని తెలుగు సినీ పరిశ్రమ ఉద్యమించేంత వరకు వివిధ రూపాలలో నా ఆందోళన కొనసాగిస్తాను నిర్మాత రవిచంద్ అన్నారు.