Thursday, 5 November 2026

దేవినేనికి రైతుల సన్మానం

 విజయవాడ,మే12(జ‌నం సాక్షి ): జల వనరుల శాఖ మంత్రి దేవినేనికి గొల్లపూడి రైతులు శనివారం ఉదయం విజయవాడ జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మంత్రి దేవినేనికి గొల్లపూడి ప్రాంత రైతులందరు ఋణపడి ఉంటామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి పంటలను కాపాడటంతో రెండో పంటలో కూడా 50 బస్తాలు ధాన్యం పండించుకోగలిగామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.