సిపిఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ర్యాలీ

విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ( సిపిఎస్‌ ) రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు. రైల్వే స్టేషన్‌ నుంచి జింఖానా గ్రౌండ్స్‌ వరకు ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ఉద్యోగులు సిపిఎస్‌ విధానంతో నష్టపోతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు, పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సిపిఎస్‌ రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు