Wednesday, 4 November 2026

సిలికాన్‌వ్యాలీలో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ భేటీ

4

శాన్‌ఫ్రాన్సిస్కో, మే 15(జనంసాక్షి)  : అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిక్కీ ఆధ్వర్యంలో సిలికాన్‌ వ్యాలీలోని శాంతాక్లారా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నూతన పారిశ్రామికవేత్తల సౌకర్యార్థం ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక ా’ాదన విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో విద్యుత్‌ కోతల ప్రస్తావన లేకుండా పోయిందన్నారు. నాలుగేళ్లలో తెలంగాణను విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *