జంటనగరాల్లో సివిల్ సప్లై గోదాంలను మంత్రి ఈటెల రాజేందర్ అకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ బోయిగూడలోని సర్కిల్ -8, సర్కిల్ -9గోదాంలను తనిఖీ చేసిన మంత్రి ఈటెల…. గోదాంలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. బియ్యం, గోధుమలు, చక్కెర, కందిపప్పు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈటెల తెలిపారు.
సివిల్ సప్లై గోదాంలపై మంత్రి అకస్మిక తనిఖీలు




