– తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నాం
– రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు
– టీపీపీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
– రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, మే21(జనం సాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే విజయమని, కాంగ్రెస్ గెలిచిన తరువాత రాహుల్ గాంధీనే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా పనిచేసి.. బీజేపీ, టిఆర్‌ఎస్‌ను తరిమికొడదామని ప్రజలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని అన్నారు. రాష్ట్రలో తెరాస ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని, ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అవినీతిలో రాష్ట్రం తెలంగాణలో నాల్గవ స్థానం ల నిలిచిందన్నారు. రాష్ట్రంలో అవినీతి లేదని చెప్పుకుంటున్న కేసీఆర్ ఈ సర్వే రిపోర్టులపై నోరు మెదపాలన్నారు. రైతుబంధు పథంతో ఎన్నికల్లో లబ్ధిపొందేలా తెరాస ప్రభుత్వం ప్లాన్ చేసిందని అన్నారు. కేవలం ఈ పథకం ధనిక రైతులకే మేలు చేకూర్చుతుందని, చిన్న, సన్నకారు రైతులకు లాభం లేదన్నారు. మరోవైపు కౌలు రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతుందన్నారు. రాష్ట్రంలో తెరాస పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆవేదనతో ఉన్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో తెరాసకు తగిన గుణపాఠం తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణలో కుర్చీ కోసం కొట్లాట సరికాదన్నారు. దేశంలో రాజీవ్‌గాంధీ సాంకేతిక విప్లవం తెచ్చారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. దేశంలో మతపరమైన విభజన తీసుకొచ్చి.. గాంధీ కుటుంబం పేరు చెరిపేయాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
————————————-
సీఎం అభ్యర్థిని రాహులే నిర్ణయిస్తారు




