Friday, 6 November 2026

సీఎం ఆదేశిస్తే విజసాయిరెడ్డిపై పోటీకి దిగుతా

– విజయసాయి దండుపాళ్యం బృందానికి నాయకుడు
– చంద్రబాబును చూసే 2014లో ప్రజలు ఓట్లేశారు
– ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
అమరావతి, మే21(జ‌నం సాక్షి) : వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి దండుపాళ్యం బృందానికి నాయకుడని, సీఎం ఆదేశిస్తే  విజయసాయిరెడ్డిపై పోటీకి సిద్ధమన, విశాఖలో పోటీచేసి ఆయనను 2.2లక్షల ఓట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిస్తానని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా తన వల్లే ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్న జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే 2014 ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారన్నారు. అమిత్‌ షా దర్శకత్వంలో నాలుగు పార్టీల అధ్యక్షులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రఘువీరా రెడ్డి, జగన్‌, కన్నా వీళ్లంతా ఒక్క తానులోని ముక్కలేనని, విజయసాయిరెడ్డి పప్పులు తమ వద్ద ఉడకవన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు. పట్టిసీమను రికార్డు స్థాయిలో పూర్తిచేసి సాగునీరు అందించామన్నారు. పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించి పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాల్సిన కేంద్రం చంద్రబాబుపైనే విమర్శలు చేస్తుందన్నారు. ప్రత్యేక ¬దా ఇస్తామన్ని, ప్యాకేజీ ఇస్తామని నాలుగేళ్లు వేచి చూసినా ఏపీ పట్ల కేంద్రం వివక్షత ప్రదర్శించిందన్నారు. అందుకే కేంద్రంతో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చామని అన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి పనికిరాని ప్రతిపక్ష నేత అని విమర్శించారు. చంద్రబాబు కేంద్రంను ఢీకొంటూ ప్రత్యేక¬దా కోసం పోరాడుతుంటే జగన్‌ మాత్రం తన స్వలాభం కోసం, కేసుల మాఫీ కోసం ప్రత్యేక ¬దాను తాకట్టుపెట్టి ప్రధాని మోదీ, అమిత్‌షాలకు వంతపాడుతున్నారని అన్నారు. ప్రత్యేక ¬దా ఇచ్చేవారిని తిట్టకుండా ¬దాకోసం పోరాడేవారిని తిట్టడం జగన్‌ తీరును అర్థ చేస్తుందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన గురించి అతిగా ఊహించుకుంటున్నాడని, చంద్రబాబును తానే దగ్గరుండి గెలిపించినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని 2019లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
———————————