గాంధీ భవన్లో ప్రసంగిస్తుండగా అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు
క్షమాపణ చెప్పాలని డిమాండ్ శ్రీదురుసుగా వ్యవహరించిన సీఎం
హెదరాబాద్,అక్టోబర్ 18(జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జర్నలిస్టుల నుంచి నిరసన సెగ తగిలింది. గురువారం గాంధీభవన్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్య క్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా.. జర్నలిస్టులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండ్రోజుల క్రితం ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్న కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన చానళ్ల ప్రతినిధులను అనుమతించక పోవడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విూడియాకు ప్రాంతీయ భావం ఆపాదించారని, ఓ ప్రాంత విలేకరుల పట్ల వివక్ష ప్రదర్శించారని మండిపడ్డారు. జర్నలిస్టుల వివక్ష చూపడం సరికాదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా జర్నలిస్టులు నిరసన తెలపడంతో సీఎం కిన్నులయ్యారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి, చూస్తుండిపోయారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకొని, జర్నలిస్టులను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని, కానీ దానికి ఓ పద్దతి ఉంటుందని
తెలిపారు. ఇది పార్టీ కార్యక్రమమని, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం సరికాదన్నారు. జర్నలిస్టులపై వివక్ష చూపడం తప్పేనని, దీనిపై ప్రభుత్వం తరఫున తాను ప్రకటన చేయిస్తానని హావిూ ఇచ్చారు. అంతకుముందు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం గాంధీభవన్‌కు వచ్చిన సీఎంకు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జిలు ధరించి పాత్రికేయులు నిరసన తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ విూడియా పట్ల దురుసుగా ప్రవర్తించారని, వివక్ష చూపారని కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, సీఎం అసహనం వ్యక్తం చేస్తూ.. ‘నేను ఏం చేయాలనేది కూడా విూరు నాకు చెబుతారా?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘మా పార్టీ ఆఫీసులో ఆందోళన చేసే హక్కు విూకెక్కడిది’ అని వ్యాఖ్యానించారు. ‘మేం చెప్పినవన్నీ విూరు రాస్తున్నారా? విూరు చెప్పినవన్ని మేం చేయాలా?’ అని జర్నలిస్టులను నిలదీశారు. దీనిపై పాత్రికేయులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత సర్దుకుంటూ.. పీఎం టూర్లో తెలంగాణ విూడియాను అడ్డుకున్న విషయం నాకు తెలియదు. ఘటనపై వివరాలు తెప్పించుకుంటానని చెప్పి మెల్లిగా జారుకున్నారు. అయితే, ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాత్రికేయులు.. కిరణ్ సభలో మాట్లాడుతుండగా అడ్డుకునే యత్నం చేశారు. చివరకు బొత్స జోక్యంతో ఆందోళన విరమించారు.





