Wednesday, 4 November 2026

సీఎం కేసీఆర్‌తో ఇంధనశాఖ అధికారులు భేటీ

CM KCR meeting with officials of the Department of Energy

న్యూఢిల్లీ : హస్తినలో సీఎం కేసీఆర్ రెండో రోజు కూడా బిజిబిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై సీఎం చర్చిస్తున్నారు. ఈ సాయంత్రం 5.30 గంటలకు సీఎం కేసీఆర్‌తో ఇంధన శాఖ అధికారులు భేటీ అయ్యారు. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలను అధికారులు కేసీఆర్‌కు వివరిస్తున్నారు. విభాగాల వారీగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను అధికారులు తయారు చేశారు. మరి కాసేపట్లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *