040-23454071కు 2,534 ఫిర్యాదులు
హైదారాబాద్ జనం సాక్షి: ‘లంచం అడిగితే చంపేస్తా.. ఎవరైనా అడిగితే నాకు ఫోన్ చేయండి’ అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటనలో చేసిన ప్రకటనకు భారీగా స్పందన వస్తోంది. సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ (040-23454071)కు తొలిరోజే భారీస్థాయిలో ఫిర్యాదులు అందాయి. లంచాలకు సంబంధించిన వాటితో పాటు ఇతర సమస్యలపైనా ప్రజలు ఫిర్యాదులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల పరంపరను చూసిన సీఎం.. ప్రస్తుతమున్న 30 లైన్ల వ్యవస్థను 60 లైన్లకు పెంచాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం వరకు వివిధ జిల్లాల నుంచి 2,534 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా పెన్ష న్లు అందకపోవడం, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో లంచంకోసం వేధించడం, రేషన్‌కార్డుపై రేషన్ ఇవ్వకపోవడం, రుణాలు మాఫీ కాకపోవడం, ఇళ్ల మంజూరుకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, ప్రస్తుత కాల్‌సెంటర్‌కు త్వరలోనే సంక్షిప్త సమాచారం (ఎస్సెమ్మెస్) ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుత నంబర్‌కే ఎస్సెమ్మెస్ చేస్తే సరిపోతుందని, ఈ-మెయిల్ ఐడీని కూడా ప్రకటిస్తామని పేర్కొంది. ఈ ఫిర్యాదులను శాఖల వారీగా విభజించి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించింది.




