సీతారామపురం లో ఒక ప్రేమ జంట నిర్మాత బీసు చందర్ హీరో రణధీర్ ను సన్మానించిన బీసీ సంఘం రాష్ట్ర నాయకులు దర్గా చిన్న గౌడ్
బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న గౌడ్ సీతారామపురం లో ఒక ప్రేమ జంట సినిమా హీరో రణధీర్ చిత్ర నిర్మాత బీసు చందర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా దర్గా చిన్న గౌడ్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకు మన తెలంగాణ నుండి మరొక యువ హీరో రావడం చాలా సంతోషకరం వ్యక్తం చేస్తూ హీరో రణధీర్ కి భవిష్యత్తులో ఇంకా ఎన్నో సినిమాలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు చిత్ర నిర్మాత బీసు చందర్ గౌడ్ ని చిత్ర సమర్పకురాలు బీసు ధనలక్ష్మిని అభినందించారు ఇంత మంచి ప్రేమ కథ చిత్రాన్ని నిర్మించిన బీసు చందర్ గౌడ్ ఇంకా మంచి చిత్రాలను నిర్మించాలని సీతారామపురంలో ఒక ప్రేమజంట సినిమా సూపర్ హిట్ కావాలని నిర్మాతకి హీరోకి మంచి పేరు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకురాలు పన్యాల మమత గౌడ్ ఎలగందుల విజయ్ కందుకూరి విజయ్ తదితరులు పాల్గొన్నారు