Tuesday, 3 November 2026

సీనియర్ నటి కన్నుమూత

61465104852_625x300

ముంబై: సీనియర్ నటి సులభ దేశ్పాండే ముంబైలోని స్వగహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సులభ శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

79 ఏళ్ల సులభ పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్తో కలసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్పాండేతో కలసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. అరవింద్ దేశ్పాండే 1987లో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *