సీ.ఎం. సహాయ నిధి చెక్కుల అందజేత
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో నాలుగు, ఇరవై ఒకటవ వార్డు పరిధులలో వున్నటువంటి లబ్ధిదారులకు డెబ్బది మూడు వేల రూపాయల సీ.ఎం సహాయ నిధి చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జంగం కల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, టి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ,కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పొగులమల్లయ్య, రేవెళ్ళి ఓదెలు, పొలం సత్యం, పార్వతి విజయ, టి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు పాల్గోన్నారు.