సుప్రీం తీర్పుకు నిరసనగా 23న దీక్షచేస్తా
– అట్రాసిటీ చట్టానికి తగిన భద్రత కల్పించాలి
– మాజీ మంత్రి రావెల
గుంటూరు, జులై5(జనం సాక్షి) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పుకు నిరసనగా ఈ నెల 23న దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. గురువార ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల చట్టం బలహీన పడిందని, కోరలు పీకిన పులి లాగా అట్రాసిటీ చట్టం తయారైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో, దేశ వ్యాప్తంగా దళితులలో అభద్రతభావం ఏర్పడిందని చెప్పారు. ఏపీలో కూడా దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న గిరిజనులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో అట్రాసిటీ చట్టానికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాను దీక్షకు కూర్చోనున్నట్లు రావెల ప్రకటించారు. ఇటీవీల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రభుత్వాలు పునఃసవిూక్షించాలని, నిజనిర్దార అయిన తరువాతనే సదరు నిందితులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ధర్మాసనం తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చేందుకే సుప్రీంకోర్టు తీర్పు ఉందని దళితల సంఘాలు మండిపడ్డాయి. ఇలాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకొనేలా అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి పునఃసవిూక్షించిన సుప్రీంకోర్టు తీర్పులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసేయమని చెప్పలేదని, కేవలం ఆ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకొనే క్రమంలో పూర్తి వాస్తవాలను విచారించిన తరువాతనే చర్యలకు పూనుకోవాలని సూచించినట్లు పేర్కొంది.