*సూగుర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష*

పెబ్బేరు జూలై 2  ( జనంసాక్షి ):    పెబ్బేరు మండలంలోని సూగుర్ గ్రామ హాజ్రత్ ఫఖు రుల్లా షా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాల్లో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మీన్ భాష  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్గా పూజారులు,సర్పంచ్ కలెక్టర్ సన్మానించారు. అనంతరం దర్గా ఆవరణలో సహపంక్తి భోజనాలు చేశారు.అంతకముందు  దర్గా పీఠాధిపతి అజ్మతుల్లా షా ఖాద్రి ఆధ్వర్యంలో దర్గా నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష కు ఘన స్వాగతం పలుకుతు దర్గాలో ఫాతిహా సమర్పించి,సలాతు వస్సలాంతో సజీవ సమాధి అయిన హజరత్ ఫఖురుల్లా షా ఖాద్రి రహేమతుల్లా పూజలు చేశారు . కార్యక్రమంలో సూగూర్ సర్పంచ్ వెంకటేష్, నరసింహ, కౌన్సిలర్ ఖాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.